
యాసంగికి ఇప్పుడే కొంటున్నారు
● ఫలితంగానే యూరియా కొరత ● ఆర్డీఓ జయచంద్రారెడ్డి వెల్లడి
తూప్రాన్/చేగుంట: మార్కెట్లో యూరియా కొరతను గుర్తించిన కొందరు రైతులు యాసంగి పంట కోసం ఇప్పుటి నుంచే యూరియా కొనుగోలు చేస్తున్నారని ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. సోమ వారం తన కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధి కారి దేవకుమార్, పోలీసులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుత సీజన్‌లో రాష్ట్రంలో యూరియా కొరతను దృష్టిలో పెట్టుకొని కొందరు యాసంగి పంట కోసం యూరియాను కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నట్లు తమ విచారణలో వెల్లడైందన్నా రు. ఈ విధంగా కొనుగోలు చేస్తే బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్లు భావించాల్సి వస్తుందని హెచ్చరించా రు. రైతులు తమ భూమి విస్తీర్ణానికి సరిపడా యూ రియా బస్తాలు మాత్రమే కొనుగోలు చేయాలని, దానికి అనుగుణంగానే టోకెన్లు జారీ చేసి యూరి యా బస్తాలు పంపిణీ చేస్తున్నారని వివరించారు. సమావేశంలో సీఐ రంగ కృష్ణ, ఎస్‌ఐ శివానందం, మండల వ్యవసాయాధికారి గంగుమల్లు పాల్గొన్నారు. అనంతరం చేగుంట తహసీల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో సమావేశం నిర్వహించారు.