
వామ్మో ఇదేం భోజనం?
సిద్దిపేటఅర్బన్: సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం చెప్పిన విధంగా కామన్ డైట్ అందించడంతో పాటు రుచికరమైన భోజనాన్ని అందించాలని నిత్యం కలెక్టర్ హాస్టళ్లలో తనిఖీలు చేస్తున్నారు. అయినా కొందరు ప్రిన్సిపాల్స్‌కు, వంట సిబ్బందికి అవేం పట్టడం లేదు. వివరాలు ఇలా... సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్‌లో శుక్రవారం కొందరు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్‌ను విజిట్ చేయగా కుళ్లిపోయిన కూరగాయలు, పురుగులు పట్టిన బీరకాయలు దర్శనమిచ్చాయి. హాస్టల్ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రతతో నిండిపోయాయి. దోమతెరలు లేకపోవడంతో నిద్రించే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని, చాలామంది అనారోగ్యం పాలవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లు గడుస్తున్నా విద్యార్థినులకు దుస్తులు, ట్రంక్ పెట్టెలు ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. ప్రిన్సిపాల్ విద్యార్థినిల పట్ల దురుసుగా వ్యవహరిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. నిత్యం హాస్టళ్లను తనిఖీ చేస్తున్న కలెక్టర్ ఈ హాస్టల్‌పై దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.
హాస్టల్‌లో కుళ్లిన
కూరగాయలతో వంటలు
నిత్యం తనిఖీలు చేస్తున్నా
కానరాని మార్పు
చర్యలు తీసుకోవాలి:
విద్యార్థుల తల్లిదండ్రులు

వామ్మో ఇదేం భోజనం?

వామ్మో ఇదేం భోజనం?