
ఉద్యాన వర్సిటీకి దక్కని ర్యాంకింగ్
సాక్షి, సిద్దిపేట: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్)లో సిద్దిపేటకు చెందిన శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీకి చోటు దక్కలేదు. 2025 సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులను ఎన్‌ఐఆర్‌ఎఫ్ ఇటీవల విడుదల చేసింది. బోధన, శిక్షణ , మౌలిక వసతులు, పరిశోధన, వృత్తి నైపుణ్యం, మెలకువలు, ఉపాధి అవకాశాలు ఆర్థిక పరమైన అంశాలతో పాటు ఇతర కొలమానాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయిస్తారు. ఉద్యాన యూనివర్సిటీకి అనుబంధంగా మూడు కళాశాలలు, 11 రిసెర్చ్ స్టేషన్‌లు ఉండగా వీటికి దాదాపు 150 టీచింగ్ స్టాఫ్ ఉండాలి. కానీ 61 మంది మాత్రమే ఉన్నారు. ర్యాంక్ కేటాయించకపోవడానికి ప్రధాన కారణం ఇదే అని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ప్రకటించే ర్యాంకింగ్ వరకై నా టీచింగ్ స్టాఫ్‌ను నియమించి , ర్యాంక్ వచ్చేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది.