
ట్రాన్స్‌ఫార్మర్ పేలి మంటలు
నర్సాపూర్ రూరల్: ట్రానన్స్‌ఫార్మర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన మండలంలోని కాగజ్ మద్దూరులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు... గ్రామంలో పెద్ద శబ్దంతో ట్రాన్స్‌ఫార్మర్ పేలి మంటలు రావడంతో చుట్టుపక్కల ఇండ్లతో పాటు గ్రామంలోని ప్రధాన దారి వెంట వెళ్లే పాదచారులు, వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు పెట్టారు. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సరఫరా నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్‌తోనే పేలి మంటలు చెలరేగినట్లు విద్యుత్ శాఖ ఏడీ రమణ రెడ్డి తెలిపారు. వెంటనే సింగిల్ ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించి సరఫరాను పునరుద్ధరించారు.
భయంతో పరుగులు పెట్టిన స్థానికులు