
నిమజ్జనానికి వెళ్లి.. నీట మునిగి..
హవేళిఘణాపూర్(మెదక్): వినాయక నిమజ్జనానికి వెళ్లి నీటిలో మునిగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని తొగిటలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మొండి సుజాత ప్రభాకర్ ఏకై క కుమారుడు సుధాకర్(19) యూత్ సభ్యులతో కలిసి నిమజ్జనానికి గ్రామ శివారులో ఉన్న రామస్వామి చెరువులోకి వెళ్లారు. గణేశ్‌ను నిమజ్జనం చేస్తుండగా సుధాకర్ నీటిలో మునిగిపోయాడు. దీంతో గమనించిన తోటి యువకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు గ్రామస్తుల సహకారంతో వెతకగా మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సంతోశ్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడు మృతి