
తల్లీకూతుళ్లు అదృశ్యం
తూప్రాన్: ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన మండలంలోని మల్కాపూర్‌లో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ శివానందం వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చింతల మహేందర్‌కు శిరీషాతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే మహేందర్ ఆరోగ్యం క్షిణించడంతో రెండు నెలల క్రితం తిరిగి స్వగ్రామానికి వచ్చారు. కాగా ఈ నెల 4న గురువారం హైదరాబాద్‌లో పని ఉందని మహేందర్ భార్యతో చెప్పడంతో, తాను కూడా వస్తానని గొడవపడింది. శుక్రవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి భార్య శిరీషా, కూతుళ్లు హారిక,ఆద్యతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. బంధువుల వద్ద, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తల్లీకూతుళ్లు అదృశ్యం