
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
శివ్వంపేట(నర్సాపూర్): గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని పెద్దగొట్టిముక్ల గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గంగన్నగారి నాగరాజు(37) గోమారంలో నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం రాత్రి పెద్దగొట్టిముక్ల నుండి గోమారానికి నడుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య భాగ్యలక్ష్మి, చిన్నారులు గౌరమ్మ, గంగమ్మ ఉన్నారు.
లారీని ఢీకొట్టిన కారు.. తప్పిన ప్రమాదం
చిన్నశంకరంపేట(మెదక్): వల్లూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన నార్సింగి మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు... జాతీయ రహదారిపై పెట్రోల్‌పంప్ సమీపంలో హైదరాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి ముందు వెళుతున్న లారీని వెనకవైపు నుంచి ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ఉన్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారు నాగపూర్ నుంచి ఒంగోల్‌కు వెళుతున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఫిర్యాదు అందలేదని నార్సింగి ఎస్‌ఐ సృజన తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి