
12 మేకలు మృత్యువాత
యూరియా నీళ్లు తాగి..
వర్గల్(గజ్వేల్): యూరియా నీళ్లు తాగి 12 మేకలు మృతిచెందగా, మరో 52 అస్వస్థతకు గురయ్యాయి. ఈ ఘటన మండలంలోని గుంటిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఒక్కో మేక రూ.20వేల విలువ ఉంటుందని, రూ. 2.40 లక్షల నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. స్థానిక పశువైద్యాధికారి సర్వోత్తంయాదవ్ వివరాల ప్రకారం... బొమ్మ సాయిలు, బొమ్మ పాపయ్య తదితరులకు చెందిన మేకలు మేతకు వెళ్లి తిరిగొస్తూ ఓ పొలం వద్ద చేను కోసం బకెట్లో ఉన్న యూరియా కలిపిన నీళ్లను తాగాయి. కొద్దిసేపట్లోనే ఒకటి తరువాత ఒకటి 12 మేకలు మృతిచెందగా, మరో 52 అస్వస్థతకు గురయ్యాయి. బాధితులు వెంటనే అప్రమత్తమై పశువైద్యులకు సమాచారం అందించారు. పశువైద్యాధికారి సర్వోత్తంయాదవ్, వెటర్నరీ అసిస్టెంట్ మహేందర్, గోపాలమిత్ర రాంబాబు, ఆంజనేయులు అక్కడికి చేరుకుని చికిత్స అందించారు. అస్వస్థతకు గురైన మేకలు కోలుకున్నాయని తెలిపారు.
మరో 52 అస్వస్థత