
శభాష్.. పోలీస్
మద్దూరు(హుస్నాబాద్): ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని పోలీసులు రక్షించారు. వివరాలు ఇలా... మండలంలోని రేబర్తి గ్రామానికి చెందిన ఎర్రబ్చల రాజు (46) తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన కుమారుడు శ్రీకాంత్‌కు ఫోన్ చేసి చెప్పి పెట్టేశాడు. దీంతో ఒక్కసారిగా కంగారు పడిన కుమారుడు తిరిగి తండ్రికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో శ్రీకాంత్ మద్దూరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసు పోలీసు సిబ్బంది రాజు ఫోన్ నంబర్ తీసుకుని సిద్దిపేట ఐటీ కోర్ సహాయంతో అతడు ఉన్న లొకేషన్‌ను గుర్తించారు. కూటిగల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అతడ్ని గుర్తించి, తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆత్మహత్యకు
యత్నించిన వ్యక్తిని కాపాడి..
కుటుంబసభ్యులకు అప్పగింత