
రేపటి నుంచి దాదా హజ్రత్ ఉర్సు ఉత్సవాలు
పుల్కల్: మండల పరిధిలోని సింగూర్ గ్రామంలో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు దాదా హజ్రత్ ఉర్సు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు దర్గా పీఠాధిపతి మహ్మద్ ఆబిద్ హుస్సేన్ సత్తరుల్ ఖాద్రీ సహేబ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత 80వ సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు కుల మతాలతకు అతీతంగా వేలాది మంది భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. ఉత్సవాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. దర్గాను రంగురంగుల దీపాలతో అందంగా అలంకరించారు. ఎంతో పవిత్రత కల్గిన గంధం, చాదర్ ఇంటి నుంచి తీసుకొని దర్గాలోకి తీసికెళ్లి కీలక ఘట్టాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. 6వ తేదీన వాలీబాల్ పోటీలు నిర్వహిస్తారు. సాయంత్రం నాతే మహిఫిల్, సమ, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ముఖ్య అతిథులుగా అన్నసాగర్ పీఠాధిపతి హజ్రత్ సుఫీ షా మహ్మద్ ఖలీల్ హుస్సేన్ ఉర్ఫ్ జహీద్ హుస్సేన్ సత్తరుల్ ఖాద్రీ పాల్గొంటారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆబిద్ హుస్సేన్ కోరారు.
ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం
: పీఠాధిపతి ఆబిద్ హుస్సేన్