
కవితవి అసత్య ఆరోపణలు
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి: మాజీ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు అసత్యాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఇవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలన్నారు. కేసీఆర్ మాట జవదాటి ఒక్క అడుగు కూడా హరీశ్‌రావు వేరే వైపు వెళ్లనే లేదు. కేసీఆర్ ఏ పని చెప్పినా ఎందుకు? అని అడగకుండా ప్రతి పని చేశారు. ఉద్యమ సమయంలో ఎన్నిసార్లు రాజీనామా చేయాలని కేసీఆర్ ఆదేశించినా..అన్నిసార్లూ రాజీనామా చేసి ఉద్యమ వేడిని రగిలించిన నేత హరీశ్‌రావు అని స్పష్టం చేశారు. హరీశ్‌రావుపై కవిత చేసిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఒక ప్రకటనలో ఖండించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు... పట్టణ శివారులో ఎక్కలదేవు బండవద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనగా, వ్యక్తి తీవ్ర గాయాలకు గురైనట్లు అజయ్ అనే వ్యక్తి 100కు ఫోన్ చేసి సమాచారం అందజేశాడు. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వెళ్లి చూడగా, అప్పటికే సదరు వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.