
బుధవారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
జహీరాబాద్‌లో ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్‌రావు, పార్టీ కార్యకర్తలు
సంగారెడ్డిలో రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కార్యకర్తలు
సంగారెడ్డి /జహీరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కె.మాణిక్‌రావు విమర్శించారు. మంగళవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సంగారెడ్డి, జహీరాబాద్ పట్టణాల్లో ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వేర్వేరుగా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ను బద్నామ్ చేసేందుకు తప్పుడు నివేదికలతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు. ఇది కేసీఆర్‌పై చేస్తున్న కుట్ర మాత్రమే కాదని, తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గురుదక్షిణ చెల్లించుకోవడానికి కాళేశ్వ రం ప్రాజెక్టును మూత పడాలని, గోదావరి జలా లు బనకచర్లకు వెళ్లేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. సీబీఐకీ కాళేశ్వరం కేసు అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసివేయడమేనని చెప్పారు. నిన్నటి దాక సీబీఐపై వ్యతిరేకంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక్క రోజులోనే ఎందుకు మాట మార్చారో చెప్పా లని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు, రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారి దృష్టి మరల్చేందుకు కాళేశ్వరం నాటకం ఆడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. .సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్‌లు విజేందర్ రెడ్డి, బుచ్చిరెడ్డి ,నాయకులు వెంకటేశ్వర్లు ,నర్సింలు, అలాగే.. జహీరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ, నర్సింహు లు, సంజీవరెడ్డి, వెంకటేశం, రవీందర్, నాయ కులు బండి మోహన్, మొహియొద్దీన్, బొగ్గుల సంగమేశ్వర్, నర్సింహాగౌడ్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌ను బద్నామ్ చేసేందుకు యత్నం

బుధవారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

బుధవారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025