
గతుకుల రోడ్లు.. అగచాట్లు
కోహీర్–తాండూరు ప్రధాన రహదారి అధ్వానం
క్రీడాజ్యోతిని వెలిగిస్తున్న నాయకులు
జహీరాబాద్: మండల కేంద్రమైన కోహీర్ పట్టణం మీదుగా 65వ జాతీయ రహదారి నుంచి తాండూరు వెళ్లే రహదారిపై పెద్ద గోతులు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి నుంచి బిలాల్‌పూర్ గ్రామమైన రాష్ట్ర సరిహద్దు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారిపై గోతులు ఏర్పడ్డాయి. రాత్రి పూట అయితే ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని పలువురు ఆవేదన చెందుతున్నారు.
కోహీర్ పట్టణంలో అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పడిన పెద్ద గోతిని పూడ్చే విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు నుంచి మనియార్‌పల్లి, బిలాల్ పూర్, కోహీర్ గ్రామాల మీదుగా 65వ జాతీయ రహదారి వరకు ఆర్‌అండ్‌బీ రహదారిపై గోతులు ఏర్పడినా వాటిని తాత్కాలిక మరమ్మతులు చేయడం లేదు. వికారాబాద్ జిల్లా తాండూరు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి కావడంతో ట్రాఫిక్ అధికంగా ఉంటోంది. ఈ రహదారి మీదుగా భారీ వాహనాలు రాక పోకలు సాగిస్తుంటాయి. పెద్ద గోతులు ఏర్పడటంతో అధిక లోడ్‌తో వెళ్లే వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్ధ కాలం క్రితం రహదారికి ప్యాచ్ వర్క్ పనులు చేసి సరిపెట్టారు. క్రమంగా రహదారి దెబ్బతినడంతో ప్రజల పాలిట శాపంగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
కోహీర్–తాండూర్ ఆర్‌అండ్‌బీ రహదారిపై కోహీర్ అంబేద్కర్‌చౌక్ వద్ద ఏర్పడిన పెద్ద గోతి
దెబ్బతిన్న రోడ్డుపై ఏర్పడిన పెద్ద గోతులు
వాహనాదారులకు తప్పని పాట్లు
తాత్కాలిక మరమ్మతులకు ప్రతిపాదించాం
రహదారి దెబ్బతిన్నందున తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రతిపాదించాం. రూ.15 లక్షలతో వరద నష్టం కింద నిధుల మంజూరీ కోసం ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే తాత్కాలికంగా అభివృద్ధి పనులను చేపడుతాం. పెద్ద గోతులు ఏర్పడిన ప్రాంతంలో కంకరను పోయించి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడతాం. – శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ డీఈఈ

గతుకుల రోడ్లు.. అగచాట్లు

గతుకుల రోడ్లు.. అగచాట్లు