
ఆరు గ్యారంటీలు అమలు చేయాలి
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలులో పూర్తిగా విఫలమైందని, వాటిని చిత్తశుద్ధితో నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య డిమాండ్ చేశారు. మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్‌లో ఆదివారం జరిగిన సీపీఎం పార్టీ జిల్లాస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికుల పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆగష్టు, సెప్టెంబర్ నెలలో ప్రజల సమస్యలపై గ్రామాలు, పట్టణాల్లో సర్వేలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మెదక్‌లో ఆగష్టు 4 నుంచి 13 వరకు సర్వేలు నిర్వహిస్తామని చెప్పారు. సర్వేలలో వచ్చిన సమస్యలపై ఎంపీడీఓ కార్యాలయాల ముందు ధర్నాలు చేపడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేసే కుట్రలు చేస్తుందని వెంటనే అటువంటి ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య