
మహిళల రక్షణకు భరోసా కల్పించాలి
సిద్దిపేటకమాన్ : పిల్లలు, మహిళల రక్షణకు మేమున్నామని పూర్తి నమ్మకం, భరోసా కల్పించాలని సీపీ అనురాధ తెలిపారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో షీటీమ్, భరోసా సిబ్బందితో సీపీ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షీటీమ్ మహిళలు, బాలికలకు రక్షణ కవచంగా పనిచేయాలన్నారు. పిల్లలకు గుడ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. హాట్‌స్పాట్‌లను ప్రతి రోజు మూడు నాలుగు సార్లు సందర్శించాలన్నారు. ఫిర్యాదు బాక్సులో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్‌లు, పార్క్‌లు, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో మహిళ పోలీసు స్టేషన్ సీఐ దుర్గ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు కిరణ్, మూడు డివిజన్‌ల షీటీమ్, భరోసా సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల రక్షణకు ప్రాధాన్యతనివ్వాలి
గజ్వేల్‌రూరల్: సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారికి ప్రాధాన్యతనివ్వాలని సీపీ అనురాధ పేర్కొన్నారు. గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చిన ఎస్‌ఐలు రఘుపతి, ప్రేమ్‌దీప్ గురువారం సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి సీపీ పలు సూచనలు చేశారు.
సీపీ అనురాధ