
ఎరువుల కొరత ఉండొద్దు
17మంది అధికారులకు షోకాజ్!
కలెక్టర్ ప్రావీణ్య
పల్లెకు పోయి.. పనులను పరిశీలించి
ఎద్దుమైలారం గ్రామాన్ని సందర్శించిన తమిళనాడు అధికారుల బృందం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన 17 శాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులకు కలెక్టర్ పి.ప్రావీణ్య షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 7న జరిగిన ప్రజావాణికి ఈ అధికారులు హాజరు కాకుండా, తమ కిందిస్థాయి ఉద్యోగులను పంపారు. దీనిపై కలెక్టర్ ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
సంగారెడ్డి జోన్: జిల్లాలో ఎరువుల కొరత తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..యూరియా స్టాక్‌ను ప్రణాళిక బద్ధంగా రైతులకు పారదర్శకంగా అందించాలన్నారు. అధికారులు విధిగా ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. ప్రభుత్వం సూచించిన లక్ష్యం మేరకు 3,750ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ పంటను విస్తరించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆయిల్‌పామ్ పంటపై రైతులకు అవగాహన కల్పించి సకాలంలో ప్లాంటేషన్ పూర్తి చేయించాలన్నారు. ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సునీత, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
కంది(సంగారెడ్డి): కంది మండలం ఎద్దు మైలారం గ్రామాన్ని గురువారం తమిళనాడు అధికారులు, ప్రజా ప్రతినిధుల బృందం సందర్శించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో పొందుతున్న శిక్షణలో భాగంగా ఎద్దు మైలారం గ్రామాన్ని సందర్శించి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ద్వారా జారీ చేసే మరణ, జనన ధ్రువీకరణ పత్రాలు, ఇంటి టాక్స్ పత్రాల జారీ ప్రక్రియను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్త శుద్ధీకరణ, క్రీడా ప్రాంగణం, డంప్ యార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ అనిత, ఎంపీఓ మహేందర్‌రెడ్డి, ఎంసీహెచ్‌ఆర్‌డీ ప్రోగ్రాం అధికారి అనిల్ కుమార్, ఆరోగ్య ఉపకేంద్రం డాక్టర్ రెజీనా, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌తోపాటు తమిళనాడుకు చెందిన జెడ్పీ చైర్మన్లు, సీఈఓలు, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

ఎరువుల కొరత ఉండొద్దు