
అడవి కాకర అధరహో
కిలో రూ.350 పలుకుతున్న వైనం
మెదక్ కలెక్టరేట్: ఎన్నో ఔషధ గుణాలున్న అడవి కాకరకాయ ధరలు ప్రస్తుతం మార్కెట్‌లో అదరహో అనే స్థాయిలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న ధరను చూసి ప్రజలు అదిరిపోతున్నారు. మార్కెట్‌లో అప్పుడప్పుడు కనిపించే అడవి కాకరకాయలు చాలామందికి తెలియదు. రేటు ఎక్కువైతేనేం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాంటి కాకర ప్రస్తుతం మెదక్ మార్కెట్‌లో కిలో రూ.350 ధర పలుకుతోంది. దీంతో వాటిని కొనాలని ఆశ ఉన్నప్పటికీ చాలా మంది కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇవి అటవీ ప్రాంతంలోనే పండుతాయి. కాబట్టే వీటికి అంత రేటు. ఆరోగ్యాన్నే కాదు మంచి రుచిని కలిగి ఉంటుంది. వీటిని అన్ని వయసుల వారు తినొచ్చు. వర్షాకాలంలో తింటే మరీ మంచిదని పెద్దలు చెబుతారు. వర్షాకాలంలో మొదలయ్యే జలుబు, దగ్గు, తుమ్ముల నుంచి రక్షిస్తుంది. కాకరతో బహుళప్రయోజనాలు ఉన్నాయి.