
మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ...మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 94901 29839 నంబర్ సంప్రదించాలని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
‘తపస్’ జిల్లా ప్రధాన
కార్యదర్శిగా కోట సుధాకర్
జహీరాబాద్ టౌన్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోట సుధాకర్ నియమితులయ్యారు. తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ ఆదివారం జహీరాబాద్ పట్టణానికి వచ్చిన సందర్భంగా తపస్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కోట సుధాకర్‌ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తపస్ జిల్లా కార్యదర్శిగా నియమించడం పట్ల సుధాకర్ రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీ రఘునందన్‌రావుకు ఎమ్మెల్యే గూడెం పరామర్శ
పటాన్ చెరు టౌన్: ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావును ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఎంపీ రఘునందన్‌రావును ఆదివారం పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి కృపతో త్వరితగతిన కోలుకుని ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు.
ఉచిత వైద్య శిబిరానికి
స్పందన భేష్
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల పరిధిలోని మెటల్‌కుంట గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది. జహీరాబాద్‌లోని ప్రగతి నర్సింగ్‌హోమ్, దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ(డీడీఎస్) వారి ఆధ్వర్యంలో మెడ్ బ్రిడ్జి స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామంతోపాటు ఇతర గ్రామాలకు చెందిన రోగులు తరలి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. 250 మందికి పైగా రోగులకు పరీక్షలు నిర్వహించిన వైద్యు లు వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. శిబిరానికి జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ తిరుపతిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి హాజరై మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం వల్ల రోగులకు ప్రయోజనం కలుగుతుందన్నా రు. ఈ సందర్భంగా వారికి డీడీఎస్ సభ్యులు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో విక్రమ్ ఆదిత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ