
ఆర్‌ఆర్‌తో ట్రాఫిక్ సమస్యలు దూరం
రింగ్ రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణం చుట్టూ లింకురోడ్లను కలుపుతూ నిర్మిస్తున్న రింగురోడ్డుతో ట్రాఫిక్ సమస్యలు దూరమవుతాయని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారంశంకర్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ పండరీరెడ్డి, అవుటి శంకర్, జానీపటేల్‌లతో కలిసి రింగురోడ్డు పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని రహదారిని విస్తరించడంతోపాటు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. పట్టణం చుట్టూ రోడ్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు పట్టణం విస్తీర్ణం కూడా పెరిగనుందన్నారు.
పేదల సంక్షేమానికి కృషి
ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషిచేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. నాయకులు కృష్ణ, దుర్గయ్య, తుకారాం, రాజేందర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.