
ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చి మరీ..
నారాయణఖేడ్: విద్యార్థుల అడ్మిషన్లకోసం ప్రతీ ఏటా పోటీ నెలకొనే స్కూళ్లలో ఖేడ్‌లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఒకటి. పాఠశాలలో సాయంత్రం సమయంలో హెచ్‌ఎం మన్మథకిషోర్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్, వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ గంటసేపు క్లాసులు, చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ప్రత్యేకంగా బోధిస్తుండటంతో ఈ స్కూల్‌లో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి సహకారంతో ఈ స్కూల్‌లో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్ శిక్షణ కొనసాగుతోంది. ఇదే పాఠశాలకు చెందిన హిందీ ఉపాధ్యాయు డు చంద్రశేఖర్ ఆచార్య సేవోద్గం ఫౌండేషన్ ద్వారా 800 మందికి బ్యాగులు, ఇంగ్లిష్ డిక్షనరీలు, నెట్‌డాటా సంస్థ సహకారంతో 4 ల్యాప్‌టాప్‌లు, లయన్స్‌క్లబ్ సౌజన్యంతో క్రీడాసామగ్రి, మార్చి ఫాస్ట్ డ్రెస్‌లు, ఇతర దాతర సహకారంతో స్పోర్ట్స్ డ్రెస్సులు, గుర్తింపు కార్డు లు ఉచితంగా అందజేస్తున్నారు. ఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి,జక్కుల యాదగిరి సౌజన్యంతో రూ.3లక్షల విలువైన మినరల్ వాటర్‌ప్లాంటు ను విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలలో ఇటీవలే ఏర్పాటు చేశారు. న్యాయవాది అనుపమారెడ్డి సహకారంతో తరగతి బోధనలో ఉపాధ్యాయులకు ఉపయోగపడే సౌండ్‌సిస్టమ్‌ను ఇచ్చారు. దీంతో ఈ ఏడాది అడ్మిషన్లు కూడా భారీగానే పెరిగాయి. గతేడాది 800 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది మరో 850 మంది అడ్మిషన్లు పొందారు. ఇక ప్రైవేట్ స్కూళ్ల నుంచి కూడా 150 మంది విద్యార్థులు ఈ స్కూల్‌లో ప్రవేశాలు తీసుకున్నారు.

ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చి మరీ..