
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
వెల్దుర్తి(తూప్రాన్): పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికవర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని జూలై 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మిక సోదరులు జయప్రదం చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి గౌరి పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రం వెల్దుర్తిలో కార్మికులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ చేపట్టే సమ్మెకు ప్రజలు, ప్రజాతంత్రవాదులు బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
నిత్యావసరాల పంపిణీ
నారాయణఖేడ్: పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన రాథోడ్ లక్ష్మీబాయికి, నాగల్‌గిద్ద మండలం మోర్గికి చెందిన గొల్లమల్లప్ప, ప్రేమలకు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మశ్చందర్ ప్రతినిధులు ఆదివారం నెలకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేశారు. నిరుపేదలను ఆదుకోవడంపై గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీకాంత్, తుకారాం, శ్రీనివాస్ సాగర్, అభిపవార్ పాల్గొన్నారు.
భూభారతికి 1690 దరఖాస్తులు
తహసీల్దార్ తులసిరాం
టేక్మాల్(మెదక్): ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులు మండలంలో పూర్తయినట్లు తహసీల్దార్ తులసిరాం పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 3 నుంచి 21 వరకు ఆయా గ్రామాల్లో రెవెన్యూ భూభారతి సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. పలు రకాల భూసమస్యలతో 1690 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను గ్రామాల వారీగా ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేసి పైఅధికారులకు నివేదిక అందించినట్లు తెలిపారు. రైతులెవ్వరూ భూసమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.
స్నేహితురాలికి చేయూత
శివ్వంపేట(నర్సాపూర్): ఆపదలో ఉన్న స్నేహితురాలికి బాల్య స్నేహితులు చేయూతనందించారు. మండల పరిధి పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన వడ్ల మాధవికి మియాపూర్‌కు చెందిన యాదగిరితో వివాహం జరిగింది. అనారోగ్యంతో యాదగిరి మృతి చెందడంతో ఇద్దరు ఆడపిల్లలతో మాధవి తల్లి వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తూ జీవనోపాధి పొందుతుంది. విషయం తెలుసుకున్న 2011–2012 విద్య సంవత్సరం పదవ తరగతి మాధవి బాల్యస్నేహితులు రూ.40 వేల ఆదివారం అందజేశారు. దీంతో తన స్నేహితులు ఆర్ధికసాయం చేయడంపై మాధవి కృతజ్ఞతలు తెలిపారు.
రిజర్వేషన్ కల్పించాకే
ఎన్నికల నిర్వహణ
బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు పాండు
సంగారెడ్డి : బీసీ రిజర్వేషన్లు 42 శాతం కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల నిర్వహించాలని బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డిలో బీసీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వాలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకపోవడంతో చాలా నష్టపోయామని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మల్లయ్య, రమేష్, జగదీశ్వర్, బాలుయాదవ్ పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి