
నిమ్జ్ రైతుల ముందస్తు అరెస్టు
మామిడ్గిలో స్వల్ప ఉద్రిక్తత
న్యాల్‌కల్(జహీరాబాద్): నిమ్జ్ రైతుల ముందస్తు అరెస్టుతో మండల పరిధిలోని మామిడ్గిలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి జహీరాబాద్ పర్యటన సందర్భంగా నిమ్జ్ రైతులు అడ్డుకునే అవకాశమున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వేకువ జామున మామిడ్గి గ్రామానికి వెళ్లిన హద్నూర్ పోలీసులు గ్రామానికి చెందిన రాజిరెడ్డి, నాగన్న, సంజీవరెడ్డి, బుచ్చిరెడ్డి, వీరారెడ్డిలతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వాళ్లను ఎందుకు అరెస్టు చేస్తున్నారని వాగ్వివాదానికి దిగి పోలీసులను అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మీకు సీఎం దగ్గరకు తీసుకు వెళ్లి ఆయనతో మాట్లాడే అవకాశం కల్పిస్తామని నచ్చ జెప్పిన పోలీసులు రైతులను నేరుగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. మామిడ్గి గ్రామానికి చెందిన వారితోపాటు ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి, శంకర్ తదితరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సీఎం సమావేశం ముగిసిన తర్వాత వారిని వదిలి పెట్టారు. ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులను కూడా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మల్గి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మారుతి యాదవ్, డప్పూర్‌కు చెందిన శివరాజ్, న్యామతాబాద్‌కు చెందిన శ్రీకాంత్, రేజింతల్‌కు చెందిన కుత్బుద్దీన్‌లను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
నారాయణఖేడ్: అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గణపతి తెలిపారు. ఖేడ్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ...ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జహీరాబాద్ పర్యటన సందర్భంగా సీపీఎం, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతున్న నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని చెప్పారు. అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.