
విద్యార్థులను తీర్చిదిద్దే నిలయాలు కేవీలు
ఝరాసంగం(జహీరాబాద్): విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే నిలయాలు కేంద్రీయ విద్యాలయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని మాచ్‌నూర్ గ్రామ శివారులో రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి ప్రారంభించారు. అనంతరం కాసేపు అక్కడి విద్యార్థులతో కలిసి మాట్లాడారు. నూతన భవనం ప్రారం భోత్సవంతో విద్యార్థులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ సునీతాపాటిల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్‌రావుపాటిల్, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రీయ విద్యాలయం
ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి