
మల్లన్న ఆలయంలో వేలం పాటలు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం బహిరంగ వేలం పాటలు ఈవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. టెండర్లలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ఎల్లమ్మ ఆలయం వద్ద వస్త్రాలు ఒడి బియ్యం సేకరించుకునే హక్కును రూ.18,30,000కు సనాది వెంకటేశ్ అధిక పాట పాడి దక్కించుకోగా ఆలయ పరిసరాల్లో పాదరక్షలను భద్రపరుచుకునే హక్కు లైసెన్స్‌ను రూ.15 లక్షలకు సనాది కరుణాకర్ దక్కించుకున్నారు. కూరగాయలు సప్లయ్ చేసే హక్కు టెండర్ చల్లా మౌనిక ఆలయం కోడ్ చేసిన ధర కంటే తక్కువ కోడ్ చేసి దక్కించుకున్నారు.
పలు టెండర్లు వాయిదా..
మల్లన్న ఆలయంలో కొబ్బరి కాయలు, ముక్కల సేకరణ, తలనీలాల సేకరణ, ఎల్లమ్మ ఆలయం వద్ద కొబ్బరి కాయల విక్రయం, కోర మీసాలు, మొక్కుబడి వస్త్రాలు, ఎల్లమ్మ ఆలయం వద్ద కూల్‌డ్రింక్స్ విక్రయం, టాయిలెట్స్ నిర్వహణ, ప్రసాదం తయారీ, పాలు పెరుగు, పూల దండల సరఫరా, ఫొటోలు, వీడియోలు, బుక్స్ ప్రింటింగ్‌ల కోసం నిర్వహించిన టెండర్లలో సరియైన షెడ్యూల్స్, పాట రాకపోవడంతోఆలయ అధికారులు టెండర్లను వాయిదా వేశారు. ఈ టెండర్లకు తిరిగి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆలయ ఈవో అన్నపూర్ణ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అంజిరెడ్డి, శ్రీనివాస్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ప్రధానర్చకులు మహదేవుని మల్లికార్జున్ ఆలయ ఉద్యోగులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో నిర్వహణ
పలు టెండర్లు వాయిదా