
ఏరువాక సాగాలో...
యువ వికాసం.. ఉపశమనం యువ వికాసంకు సిబిల్ స్కోర్‌తో సంబంధంలేదని ప్రభుత్వం చెప్పడంతో యువతలో ఆందోళనకు తెరపడింది. వివరాలు 8లో u
నత్తనడకన ధోబీ ఘాట్లు
న్యాల్‌కల్ మండలంలో ప్రభుత్వం మంజూరు చేసిన ధోబీ ఘాట్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి. వివరాలు 9లో u
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025
జిల్లాలో ఈ ఏడాది వానాకాలం (ఖరీఫ్)లో జిల్లాలో 2,98,718.22 హెక్టార్లలో వివిధ రకాలు పంటలు రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా పత్తి పంట అత్యధికంగా 1,43,817.81 హెక్టార్లలో సాగు చేయనున్నారు. రెండో ప్రధాన పంటగా వరి పంటను 59,424.7 హెక్టార్లలో సాగు జరగనుంది. కంది పంట 32,044.53 హెక్టార్లు, సోయాబీన్ 29,817.81హెక్టార్లు, పెసర 5,749.39 హెక్టార్లు, మినుము 3,465.59 హెక్టార్లు, చెరుకు 7,957.09హెక్టార్లు, మొక్కజొన్న 3,441.3, జొన్న 237.25, హార్టికల్చర్‌లో 9,898.79 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా వేశారు. వీటితోపాటు కొర్రలు, రాగులు, సామలు, స్వీట్‌కార్న్, ఎర్ర జొన్నలు, ప్యారాగ్రాస్, ఉలువలు, వేరుశనగ, ఆవాలు, సామలు, గడ్డినువ్వులు, పొద్దుతిరుగుడు, హనుములు, బెబ్బర్లు తదితర పంటలను తక్కువ మోతాదులో సాగు చేసే అవకాశం ఉంది.
2.98లక్షల హెక్టార్లలో పంటల సాగు
నారాయణఖేడ్: ఈసారి రుతుపవనాలు ముందుస్తుగానే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని అధికారులు చెబుతుండటం, అడపా దడపా జల్లులు కురుస్తూ వాతావరణం చల్లబడుతుండటంతో రైతులు వేసవి దుక్కులు దున్నడం ముమ్మరంగా చేపడుతున్నారు. వ్యవసాయ అధికారులు సైతం పంటసాగు ప్రణాళికలకు సిద్ధమవుతున్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తే ఇప్పటికే చాలామంది రైతులు వేసవి దుక్కులు దున్నడం పూర్తి చేయగా మిగతా రైతులు దుక్కులు దున్నే పనుల్లో నిమగ్నమయ్యారు.
ఈసారి ముందుగానే...
ఈ ఏడాది ఊహించినదానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కొద్దిరోజులుగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు దక్షిణ, ఉత్తర అండమాన్ సముద్రం, అండమాన్, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. రుతుపవనాల ఆగమనం దృష్ట్యా అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయని, ప్రస్తుత అంచనాల ప్రకారం జూన్ 10 నాటికి రుతుపవనాలు తెలంగాణను తాకుతాయని పేర్కొంది. ఈసారి సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
వేసవి దుక్కులతో ప్రయోజనం
వేసవి దుక్కులతో నేల సారవంతం అవుతుందని, నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. భూమి లోపలి గట్టి పొరలు పగులగొట్టడం వల్ల వేరు వ్యవస్థ ధృడంగా లోపలికి వెళ్లి బలంగా ఉంటుందని, భూమి కోతకు గురి కాకుండా అడ్డు కట్ట వేస్తుందని సూచిస్తున్నారు. తేమ శాతం పెరిగి కలుపు నివారణ, పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు. పంట దిగుబడి పెరిగి ఎరువుల ఖర్చు తగ్గుతుందని, ఎండ వేడిమికి పురుగుల అవశేషాలు చనిపోతాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. వేసవిలో కనీసం 30 సెంటీమీటర్ల లోతుగా దుక్కిదున్నాలని, గట్టి పొరలు పగిలి భూమి తేమ, పోషకాలు పెరుగుతాయని ఏడీఏ నూతన్ కుమార్ వివరించారు. వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల తొలకరివాన నీరు భూమిలోకి ఇంకేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. వేసవి దుక్కులకు ముందు పొలంలో గొర్రెలు, పశువుల మందలను ఉంచడం వల్ల వాటి విసర్జక వ్యర్థాలు సేంద్రియ ఎరువుగా భూమికి ఉపయోగ పడగలదు.
న్యూస్‌రీల్
ముమ్మరంగా సాగుతున్న వేసవి దుక్కులు ముందుగానే రుతుపవనాలు!
ఈసారి సాధారణంగా కంటే అధిక వర్షాలు
దుక్కులు దున్నుతున్నాం...
వేసవి దుక్కులు దున్నతున్నాం. ఎకరం భూమిలో గంటలకు రూ.1వేయి చొప్పున వెచ్చించి నాలుగు గంటల వ్యయంతో ట్రాక్టర్‌తో దున్నిస్తున్నా. వర్షాలు కురియగానే మరోమారు చిన్న నాగలితో దున్నించి గీతలు వేసి పత్తి పంట సాగు చేస్తా. ఈసారి వర్షాలు బాగుంటాయని అధికారులు అంటున్నారు.
– ప్రవీణ్‌కుమార్, రైతు, వెంకటాపూర్

ఏరువాక సాగాలో...

ఏరువాక సాగాలో...