
రూ.3 కోట్లతో సుందరీకరణ పనులు
జోగిపేట పట్టణంపై సర్కారు ప్రత్యేక దృష్టి
సంగుపేట వద్ద నుంచి బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడంతో జోగిపేట కళ తప్పినట్లయ్యింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు చాలావరకు మూతపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో మంత్రి జోగిపేట పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి నర్సరీ కాలేజీ, 150 పడకల ఆస్పత్రి, రూ.90 లక్షలతో అజ్జమర్రిరోడ్డు, పాలిటెక్నిక్, కేజీబీవీ పాఠశాలలకు ప్రహరీలు ఏర్పాటు, రెండు బస్టాండ్‌ల నిర్మాణం, సంగుపేట వద్ద నుంచి అన్నాసాగర్ వరకు ఫోర్‌లైన్ రోడ్డు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. వ్యాపారపరంగా చాలావరకు దెబ్బ తినడంతో ఆందోళన చెందుతున్నారు. గాంధీ, వివేకానంద పార్కులు, జంక్షన్లు, ఆర్చీలు ఏర్పాటుతో పట్టణానికి కొత్త కళ రానుంది.
● గాంధీ, వివేకానంద
పార్కుల అభివృద్ధికి నిధులు
● జంక్షన్లు, ఆర్చీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
జోగిపేట(అందోల్): జోగిపేట పట్టణ సుందరీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మున్సిపాలిటీ ఏర్పడి పదేళ్లు పూర్తయినా మున్సిపాలిటీ పేర కనీసం ఆర్చీలు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. పట్టణంలోని ప్రధాన మూల మలుపుల వద్ద జంక్షన్లు, సంగారెడ్డి, మెదక్ పట్టణాల వైపు వెళ్లేదారుల్లో మున్సిపాలిటీ శివారు ప్రాంతంలో రెండు ఆర్చీలను ఏర్పాటు చేసేందుకు స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. పట్టణం నడిబొడ్డున ఉన్న గాంధీ పార్కులో బహిరంగ మూత్ర విసర్జన, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రి..గాంధీ పార్కు అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించారు. పార్కులో లైటింగ్, గ్రీనరీ పార్కులాంటి అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. అయితే గాంధీపార్కు అభివృద్ధి పనులకు అంత పెద్దమొత్తంలో నిధులు అవసరం లేదని సగం నిధులు అందోలు లోని వివేకానంద విగ్రహం వద్ద మూడెకరాల ప్రభుత్వ స్థలాన్ని సేకరించేందుకు ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్‌లకు మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. మూడెకరాల్లో గార్డెనింగ్, లైటింగ్ ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళిక తయారు చేయాలని కూడా మంత్రి సూచించినట్లు సమాచారం.
జోగిపేట
గాంధీ పార్కు
రూ.కోటితో జంక్షన్లు
అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయం ముందు, ఫైర్ స్టేషన్ వద్ద, పొట్టి శ్రీరాములు విగ్రహం చౌరస్తా వద్ద జంక్షన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను మంత్రి చేసినట్లుగా చెబుతున్నారు. ఏడాది కాలంలో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల మంత్రి నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు.
బైపాస్‌తో దెబ్బతిన్న వ్యాపారాలు

రూ.3 కోట్లతో సుందరీకరణ పనులు