రేషన్‌ బియ్యం పక్కదారి! | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పక్కదారి!

May 21 2025 8:38 AM | Updated on May 21 2025 8:38 AM

రేషన్

రేషన్‌ బియ్యం పక్కదారి!

కల్హేర్‌(నారాయణఖేడ్‌): అక్రమంగా పక్కదారి పట్టిస్తున్న 40 టన్నుల పీడీఎస్‌ బియ్యం పోలీసులు పట్టుకున్నారు. ఘటనకు చెందిన వివరాలిలా ఉన్నాయి. లారీలో అక్రమ బియ్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు సోమవారం రాత్రి సిర్గాపూర్‌ మండలం పోచాపూర్‌ చౌరస్తా వద్ద ఎస్‌ఐ డి.వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటకలోని గురిమిట్కల్‌ నుంచి కామారెడ్డి జిల్లా పిట్లంకు వెళ్తున్న లారీలో అక్రమ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విజిలెన్స్‌, సివిల్‌ సప్లయ్‌ అధికారులకు సమాచారం అందించగా వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు లారీలో ఉన్న బియ్యా న్ని పరిశీలించి వాటిని పీడీఎస్‌ బియ్యంగా ధ్రువీకరించారు. వెంటనే లారీని, పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఖేడ్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించారు. సివిల్‌ సప్లయ్‌ డీటీ సాజియోద్దిన్‌ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌ అనిల్‌కుమార్‌, యజమాని జాకీర్‌మియాపై కేసు నమోదు చేశారు.

నాణ్యమైన విత్తనాలు

విక్రయించాలి: ఏడీఏ

నారాయణఖేడ్‌: రానున్న వానాకాలంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులను విక్రయించాలని ఖేడ్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు నూతన్‌కుమార్‌ సూచించారు. నాగల్‌గిద్ద మండల కేంద్రంలో ఫర్టిలైజర్‌ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లా డారు. అధిక ధరలకు విత్తనాలు, మందులు అమ్మినా, నాసిరకం పురుగు మందులు, విత్తనాలు విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మండల వ్యవ సాయ అధికారి ప్రవీణ్‌చారి పాల్గొన్నారు.

కేంద్రానికి గుణపాఠం చెప్పాలి

సీఐటీయూ జిల్లా కోశాధికారి రాజయ్య

పటాన్‌చెరు టౌన్‌: పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి రాజయ్య కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మంగళవారం పటాన్‌చెరు పారిశ్రామికవాడలో పలు పరిశ్రమల్లో కార్మికులు నిరసన తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రామిక్‌ భవన్‌ నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ...పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించిందన్నారు. ఇవి అమలయితే దేశంలోని కార్మిక వర్గం పూర్తిగా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను భారత్‌ –పాక్‌ యుద్ధ పరిణామాల దృష్ట్యా జూలై 9కి వాయిదా వేసినట్లు వెల్లడించారు.

సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలి

జెడ్పీ డిప్యూటీ సీఈఓ స్వప్న

కల్హేర్‌(నారాయణఖేడ్‌): ప్రభుత్వ సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ స్వప్న అధికారులను ఆదేశించారు. మంగళవారం సిర్గాపూర్‌ మండల పరిషత్తు కార్యాలయాన్ని తనిఖీ చేశారు. వార్షిక బడ్జెట్‌ నిధుల ఖర్చు, తదితర వివరాలు సేకరించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మల్సుర్‌, సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

రేషన్‌ బియ్యం పక్కదారి!
1
1/2

రేషన్‌ బియ్యం పక్కదారి!

రేషన్‌ బియ్యం పక్కదారి!
2
2/2

రేషన్‌ బియ్యం పక్కదారి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement