
ఈదురు గాలుల బీభత్సం
నారాయణఖేడ్/కల్హేర్ (నారాయణఖేడ్): నారాయణఖేడ్ ప్రాంతంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. ర్యాకల్ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి ర్యాకల్, పోతన్‌పల్లి, పలుగు తండా తదితర శివార్ల మీదుగా ఉన్న 11 కేవీ విద్యుత్తు లైనుకు సంబంధించి ఏడు విద్యుత్తు స్థంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్తు సబ్‌స్టేషన్ పరిధిలోని పలుగ్రామాలు, తండాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పలుగుతండాలోని పలు ఇళ్ల రేకులు ఎగిరి కింద పడ్డాయి. కల్హేర్, నిజాంపేట్ మండలాల్లో ఖానాపూర్(కె), కృష్ణాపూర్, నాగధర్, తదితర చోట్ల్ల చెట్లు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రల వద్ద వరి, జొన్న ధాన్యం తడిసిపోయింది. ఖానాపూర్(కె)లో బాలకిష్టయ్య ఇంటిపై వర్షం ధాటికి చెట్టు విరిగిపడి పాక్షికంగా ఇల్లు ధ్వంసమైంది. మాజీ జెడ్పీటీసీ రవీందర్‌నాయక్, ఆర్‌ఐ మాధవరెడ్డి పలుగుతండాను సందర్శించి బాధితులను ఓదార్చారు. సంజీవన్‌రావుపేట్‌లో పొలం వద్ద చెట్టుకు కట్టేసిన నర్సయ్యకు చెందిన పాడెగేదె పిడుగుపాటుకు మృతి చెందింది.
విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు
పిడుగుపాటుకు గేదె మృతి
ఎగిరిపడ్డ ఇంటి పైకప్పు రేకులు