
23న జహీరాబాద్‌కు సీఎం రాక
జహీరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 23వ తేదీన జహీరాబాద్‌కు రాక సందర్భంగా కలెక్టర్ క్రాంతి ఎంపీ సురేష్‌శెట్కార్ ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. హుగ్గెల్లి జంక్షన్ వద్ద ప్రతిష్ఠించిన బసవేశ్వర విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. వేదిక ఏర్పాటు చేయాల్సిన దిక్కు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఝరాసంగంలోని కేంద్రీయ విద్యాలయంలో నూతనంగా నిర్మించిన భవన ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఆరా తీశారు. సుమారు రూ. 100కోట్లతో నిర్మించిన నిమ్జ్ ప్రాజెక్టులోకి వెళ్లే రహదారిని ప్రారంభించనున్నారు. అనంతరం జహీరాబాద్ పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్‌హాల్ మైదానంలో హెలిప్యాడ్ నిర్మాణం, ముందు భాగంలోని అల్ఫా మైదానంలో చేపట్టాల్సిన సభా వేదిక ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచ నలు చేశారు. అనంతరం ఎంపీ సురేష్ శెట్కార్, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, అదనపు కలెక్టర్లు మాధురి, ఎ.చంద్రశేఖర్, ఆర్డీఓ రామ్‌రెడ్డి, డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ శివలింగంలతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయాలని ఎంపీ సురేష్‌శెట్కార్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డిలు కార్యకర్తలను కోరారు.
సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎంపీ