
మోటార్లకు వెంటనే మరమ్మతు
నారాయణఖేడ్: బీఆర్‌ఎస్ హయాంలో కమీషన్ల కోసమే నాయకులు శ్రద్ధ చూపారని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆరోపించారు. నాగల్‌గిద్ద మండలం గూడూరు పంప్‌హౌస్‌లో చెడిపోయి పడి ఉన్న 75 హెచ్‌పీ మోటార్లను ఆయన సోమవారం పరిశీలించారు. రెండు మోటార్లను వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులకు ఆదేశించారు. నీటి సమస్య ఎక్కడ ఉన్నా అధికారులు తక్షణం స్పందించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కరస్‌గుత్తి శివారులో మీరాబాయి రావణ్ వ్యవసాయ క్షేత్రంలో ఎస్‌టీఎస్ డీసీ నిధులతో బోరు మోటారు ఢ్రిల్లింగ్ పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే.. కరస్‌గుత్తి తండాలో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. నాయకులు నారాయణ జాదవ్, శ్రీకాంత్, అనిల్ పాటిల్, రహీం, అంబ్రేష్ పాల్గొన్నారు.
75 మందికి చెక్కుల పంపిణీ
నాగల్‌గిద్ద మండల కేంద్రంతోపాటు, ఖేడ్ క్యాంపు కార్యాలయంలో ఖేడ్, నిజాంపేట్ మండలాలకు చెందిన లబ్దిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఖేడ్, నిజాంపేట్ మండలాలకు చెందిన 75మంది లబ్దిదారులకు రూ.20.98లక్షల విలువగల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు వినోద్‌పాటిల్, మాజీ ఎంపీటీసీలు పండరిరెడ్డి, దత్తాగౌడ్, నాయకులు శంకర్ ముదిరాజ్, రాంరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రాధాకిషన్, లింగారెడ్డి, అంజయ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశం