
పుచ్చలపల్లికి నివాళి
పటాన్‌చెరు టౌన్: దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం ‘సమకాలిన పరిస్థితులు–మన కర్తవ్యం’అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ... పుచ్చలపల్లి సుందరయ్య ఆశించిన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు నాగేశ్వరరావు, పాండు రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వీర రావు, రామారావు, సురేందర్ రెడ్డి, జయరాం నారాయణ పాల్గొన్నారు.