
అకాల వర్షంతో తడిసిన ఉల్లి
కంది(సంగారెడ్డి): ఇటీవల కురిసిన అకాల వర్షంతో చేతికి రావాల్సిన ఉల్లి పంట పూర్తిగా తడిసిపోయి పనికి రాకుండా పోయింది. కంది మండలంలోని చెర్లగూడెంకు చెందిన రైతు దత్తాత్రేయ స్వామి రెండు ఎకరాల పొలంలో ఉల్లి పంట సాగు చేశాడు. పంటను కోసి ఓ చోట చేర్చి సంచులు నింపేం దుకు ఇంటికి రాగా అంతలోనే రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో సుమారు వంద క్వింటాళ్ల ఉల్లి మొత్తం తడిసిపోయింది. తడిసిన ఉల్లిని ఆరబెట్టినా కుళ్లిపోతోందని, ఈసారి పంట బాగా పండినా చేతికొచ్చే సమయానికి అందకుండా పోయిందని విలపిస్తున్నాడు. అధికారులు స్పందించి పంట నష్ట పరిహారం ఇప్పించి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.