
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి జోన్: పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మిస్తున్న కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్ట చేశారు. భవన నిర్మాణ పనులను ఆమె అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ...పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. సుమారు రూ.2.5 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత అవసరాలకనుగుణంగా భవనాన్ని నిర్మించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్ అండ్ బీ డీఈ రామకృష్ణ, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు
ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి
కల్హేర్(నారాయణఖేడ్): రైతులకు ఇబ్బంది లేకుండా జొన్నలు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి సూచించారు. కల్హేర్‌లో ఆదివారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రైతులతో మాట్లడి సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. అధికంగా తరుగు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ పీఎసీఏస్ చైర్మన్ వీర్‌షెట్టి, కాంగ్రెస్ నాయకులు దేవదాస్, తుకరాం, జితేందర్‌రెడ్డి ఉన్నారు.
రేపటి నుంచి
ఉపాధ్యాయులకు శిక్షణ
రాయికోడ్(అందోల్): రాయికోడ్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు మండలంలోని ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు, ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంఈఓ టి.మాణయ్య ఆదివారం మీడియాకు వెల్లడించారు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు ‘టీజీ స్కూల్ ఎడ్యుకేషన్’యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ కేంద్రం నుంచి హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. సబ్జెక్ట్ టీచర్లు అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రతి టీచర్ ఫ్రీటెస్ట్, పోస్ట్ టెస్ట్, రోజువారీ ఫీడ్‌బ్యాక్ రాసి, డెమో పాఠాన్ని సిద్ధం చేసి ఈ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుందని తెలిపారు.
బీజేపీలో యువత చేరిక
పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి
పటాన్‌చెరు టౌన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీలో యువత చేరుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారంకు చెందిన యువకులు గోదావరి సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. అనంతరం బీజేపీ శ్రేణులతో కలిసి బీజేపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ...పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందన్నా రు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా,పటాన్‌చెరు మండల అధ్యక్షుడు కావలి వీరేశం, ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రవీందర్, నాయకులు పాల్గొన్నారు.

పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి