
మండు వేసవిలోనూ ఉట్టిపడుతున్న జలకళ
● జహీరాబాద్ ప్రాంతంలో
తగ్గని భూగర్భ జలాలు ●
● వ్యవసాయబావులు,
బోర్లలో పుష్కలంగా నీటి ఊటలు
● పంటలకు..పశు పక్ష్యాదులు, జంతువుల
కు సమృద్ధిగా నీరు
● సత్ఫలితాలిస్తున్న వాటర్‌షెడ్ పథకం
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్, మొగుడంపల్లి మండలాల్లో ఇప్పటికీ 10 మీటర్ల లోతులోనే భూగర్భజలాలున్నాయి. వ్యవసాయ బావులు, బోర్లలో సమృద్ధిగా నీటి ఊటలున్నాయి. నియోజకవర్గంలో ఐదారు చెరువులు మాత్రమే ఉన్నాయి. మండు వేసవిలోనూ పలు చెక్‌డ్యాంలలో నీరు దర్శనమిస్తోంది. మండల కేంద్రమైన కోహీర్‌లో ప్రస్తుతం 15 మీటర్ల మేర నీరు ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు. మల్‌చల్మ వద్ద ఇప్పటికీ పెద్దవాగులో నీరు ప్రవహిస్తోంది. గ్రామంలోని ఈరన్న ప్రాజెక్టు చెరవులో పుష్కలంగా నీరు ఉంది. పలు చెరువులలో నీరు ఉండటంతో జంతువులు, పశు పక్ష్యాదులు దప్పిక తీర్చుకుంటున్నాయి. జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టులోనూ నీరు నిండుకుండలా ఉంది. నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 30వేల ఎకరాల్లో ఆయా పంటలు సాగులో ఉన్నాయి.