
దేవాలయ నిర్మాణాలకు సహకరిస్తా
పటాన్‌చెరు: దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని జీవీ గుట్ట కాలనీలో నూతనంగా నిర్మించిన రాధాకృష్ణ దేవాలయం రాజగోపురం నిర్మాణానికి రూ.27 లక్షల భారీ విరాళం అందించారు. స్థానిక ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి రాజగోపురాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. భవిష్యత్తులోనూ దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే ను ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...నియోజకవర్గ వ్యాప్తంగా 200కు పైగా దేవాలయాలను సొంత నిధులతో నిర్మించడంతోపాటు పురాతన ఆలయాలను జీర్ణోధారణ చేస్తామన్నారు. కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేశ్, మాజీ కౌన్సిలర్ బాశెట్టి కృష్ణ, నరసింహారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
రాజగోపురం నిర్మాణానికి
రూ.27 లక్షల విరాళం అందజేత