
గ్రామమంతా లబ్ధి పొందుతున్నారు
వాటర్‌షెడ్ ఫలితాలతో గ్రామం అంతా లబ్ధిపొందుతున్నారు. 99 శాతం మందికి భూములున్నాయి. పంటలు పండించుకుని జీవనోపాధి పొందుతున్నారు. గతంలో నర్సాపూర్, తూప్రాన్, దుండిగల్ ప్రాంతాలకు వలస వెళ్లి కూలి పనులు చేసుకునే వారు. ఇప్పుడు గ్రామంలో వ్యవసాయం చేసుకుని అభివృద్ధి చెందుతున్నారు. నేను కూడా బోరు నీటితో ఆరు ఎకరాల్లో మూడు పంటలు పండించుకుంటున్నాను.
– రాచయ్య, మాజీ సర్పంచ్–గొట్టిగారిపల్లి
మూడు పంటలు పండిస్తున్న
నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. ఏడాది పొడువునా రెండు ఎకరాల్లో మూడు పంటలు పండించుకుంటున్నా. వర్షాకాలంలో సోయా వేస్తున్నా. పంట తీశాక ఆలుగడ్డ వేస్తున్నా. అది చేతికి వచ్చాక ఇప్పుడు మొక్కజొన్న పంట వేశాను. మిగతా రెండెకరాల్లో చెరకు పంట వేశాను. పంటలకు తగినంత నీరు బోరు నుంచి అందుతోంది.
– మైసని రాజు, రైతు–గొట్టిగారిపల్లి
26 ఎకరాల్లో పండ్ల తోటలు
తగినంత నీరు ఉన్నందున 26 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్నా. 20 ఎకరాల్లో బొప్పాయి, 6 ఎకరాల్లో అరటి పంట ఉంది. 3 ఎకరాల్లో అల్లం, 5 ఎకరాల్లో చెరకు, 5 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నాం. బోర్లలో తగినంత నీరున్నందునే అన్ని పంటలు బాగున్నాయి. దీంతో లబ్ధి పొందుతున్నాం.
– జి.సంజీవ్, రైతు–రంజోల్

గ్రామమంతా లబ్ధి పొందుతున్నారు

గ్రామమంతా లబ్ధి పొందుతున్నారు