
వైభవంగా రంగనాథస్వామి కల్యాణోత్సవం
హాజరైన మంత్రి దామోదర
జోగిపేట(అందోల్): అందోల్ గ్రామంలోని ప్రాచీన భూనీల సమేత రంగనాథస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన రంగనాథస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నిర్వాహకులు పట్టు వస్త్రాలతో కల్యాణానికి సిద్ధం చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్యామ్‌నాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణోత్సవానికి మంత్రి దామోదర రాజనర్సింహ హాజరై ప్రత్యేక పూజ లు నిర్వహించారు. మంత్రికి నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సన్మానించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌కౌన్సిలర్లు సురేందర్‌గౌడ్, హరికృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.