
సైనికుల త్యాగాలు మరువలేనివి
సిద్దిపేటజోన్: దేశ సరిహద్దు రక్షణలో సైనికుల త్యాగాలు మరువలేనివని సిద్దిపేట మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కొనియాడారు. శుక్రవారం స్థానిక కోమటిచెరువు నెక్లెస్ రోడ్ వద్ద వినూత్నంగా గ్రాటీట్యూట్ వాల్(సందేశాత్మక గోడ) ఏర్పాటు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన యుద్ధం నేపథ్యంలో మన దేశం, మన సైనికులపై ఉన్న అభిమానాన్ని గోడ మీద ఉన్న వస్త్రంపై అతికించారు. టూటౌన్ సీఐ ఉపేందర్ సైతం తన కుటుంబ సభ్యులతో కలిసి సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు సంతోష్ కుమార్, శ్రీనాథ్,శివ కుమార్, కిరణ్, గణేష్, సతీష్, రమేష్, శివ, తదితరులు పాల్గొన్నారు.