
● ఇరువర్గాలపై కేసు నమోదు ● 17 మంది బైండోవర్
చెరువు కట్టపై గొడవ
చేర్యాల(సిద్దిపేట): చెరువుకట్టపై కొట్టుకున్న కేసులో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి 17 మందిని బైండోవర్ చేశారు. ఈ ఘటన శుక్రవారం చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నీరేష్ వివరాల ప్రకారం.. ఈ నెల 13న ఓ గొడవ విషయమై ఇరు వర్గాలు మాట్లాడుకుందామని పట్టణ కేంద్రంలోని చెరువుకట్ట మీదికి వచ్చారు. ఈ క్రమంలో ఓ వర్గంలోని వ్యక్తి మరో వర్గం వారిపై దాడి చేశాడు. బాధిత వర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా దాడికి పాల్పడిన వ్యక్తి వర్గానికి సంబంధించిన 17 మందిని శుక్రవారం బైండోవర్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.