
తండ్రి వివాహేతర సంబంధానికి చెక్ పెట్టాలని..
పుల్‌కల్(అందోల్): మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ బేగరి జయమ్మ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 6న అంగన్‌వాడీ కేంద్రం నుంచి అదృశ్యమై హత్యకు గురై మెదక్ జిల్లా చేగుంట వద్ద కాలిన మృతదేహంతో లభించిన విషయం పాఠకులకు విదితమే. కేసుకు సంబంధించి జోగిపేట సీఐ అనిల్‌కుమార్, పుల్‌కల్ ఎస్‌ఐ క్రాంతి కుమార్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన బేగరి జయమ్మ అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. ఈ నెల 6న ఆమె ఇంటింటికీ గుడ్లు పంపిణీ చేస్తుండగా నిందితులైన పుట్ట అనిల్‌ికుమార్, స్నేహితుడు డప్పు వినీత్‌తో కలిసి తండ్రి ఆర్థిక లావాదేవీలను అడ్డుపెట్టుకొని జయమ్మను ఇంటిలోకి పిలిచి హత్య చేశారు. అనంతరం ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని కారులో చేగుంట సమీపంలోకి తీసుకుని పెట్రోల్ పోసి తగులబెట్టారు. నిందితుల్లో పుట్ట అనిల్‌కుమార్ తండ్రి రాములు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి జయమ్మ సహకరించేదని తెలిసింది. దీంతో వీరు ముగ్గురు రోజు అంగన్‌వాడీ కేంద్రంలో విందు చేసుకునే వారని, ఆర్థిక లావాదేవీలు కూడా జరుపుకునేవారని పోలీసులు తెలిపారు. దీంతో రాములు కొడుకు పుట్ట అనిల్ కుమార్ పథకం ప్రకారం జయమ్మను హత్య చేసి తండ్రి వివాహేతర సంబంధానికి చెక్ పెట్టాలని పథకం రచించాడు. ఈ క్రమంలో జయమ్మను తన స్నేహితుడి సహాయంతో హత్య చేసి ఆనవాళ్లు లేకుండా శవాన్ని చేగుంట సమీపంలో కాల్చి వేశారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను గురువారం రిమాండ్‌కు తరలించారు.
మధ్యవర్తి మహిళ హత్య
ఇద్దరు నిందితుల అరెస్టు