
తరుగు పేరుతో దోపిడీని అరికట్టాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్
నారాయణఖేడ్: జొన్నలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట నిర్వాహకులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని వెంటనే దీన్ని అరికట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అతిమెల మాణిక్ డిమాండ్ చేశారు. ఖేడ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల మేలు కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయగా అవి నిర్వాహకులు, దళారుల పట్ల కామధేనువుగా మారి రైతులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. అయినా అధికారులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. తూకంలో క్వింటాలుకు 5 కిలోల తరుగు తీస్తూ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల దోపి డీపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయని పక్షంలో రైతుల తరఫున పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.