
అన్నిరూట్లకు బస్సు సర్వీసులు బస్సుుపుతాం
నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసంక్షేమంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్ ఆర్టీసీ డిపోకు 30 కొత్త బస్సులు మంజూరుకాగా బుధవారం స్థానిక బస్టాండ్‌లో ఆయా బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పదేళ్ల బీఆర్‌ఎస్ హాయాంలో ఒక్క కొత్త బస్సుకూడా మంజూరు కాలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై న ఏడాదిన్నరలోనే కోరగానే మంత్రి పొన్నం ప్రభాకర్ 30 బస్సులను మంజూరు చేయించడంతోపాటు నూతనంగా 10 మంది డ్రైవర్లను నియమించారని గుర్తు చేశారు. అన్నిరూట్లలో బస్సులు నడిపేలా చూస్తామన్నారు. డీఎం మల్లేశయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కాలనీల్లో పాదయాత్ర...సమస్యలపై ఆరా
ఖేడ్ పట్టణంలోని వివేకానంద కాలనీతోపాటు పలు కాలనీల్లో సంజీవరెడ్డి పర్యటించారు. కాలనీల సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
బాలసదనంలో వేడుకలు
ఎమ్మెల్యే సంజీవరెడ్డి తన జన్మదినం సందర్భంగా సతీమణి అనుపమారెడ్డితో కలిసి స్థానిక షిర్డీసాయి బాబా ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. ఆలయ కమిటీ బాధ్యులు, నాయకులు దంపతులను గజమాలతో సత్కరించారు. స్థానిక బాలసదనంలో అనాథ బాలికల మధ్య కేకు కోసి ఎమ్మెల్యే జన్మదినం జరుపుకొన్నారు. బాలసదనానికి సొంతఖర్చుతో ఎల్‌ఈడీ టీవీని బహూకరించారు.
కొత్త బస్సుల ప్రారంభోత్సవంలో
ఎమ్మెల్యే సంజీవరెడ్డి