
భూసార పరీక్షలు తప్పనిసరి
నాగిరెడ్డిపల్లి, కొత్తపల్లిలో రైతు ముంగిట శాస్త్రవేత్తల కార్యక్రమం
జహీరాబాద్ టౌన్/జిన్నారం (పటాన్‌చెరు): రైతులు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. కోహీర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి, గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో వ్యవసాయాధికారులు డాక్టర్ తబస్సుం ఫాతిమా, డాక్టర్ హరి, నవీన్‌కుమార్, ప్రశాంత్, పటాన్‌చెరు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, శాస్త్రవేత్తలు జానకి, హేమలత ఏఈఓ ప్రణవి పాల్గొని మాట్లాడారు. పంటల సాగులో అవలంబించాల్సిన విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఎరువుల వాడకం, చీడపీడల నివారణ, విత్తానభివృద్ధి, నీటి యాజమాన్య పద్ధతులు, సమీకృత సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, వ్యవసాయ పథకాల గురించి రైతులకు వివరించారు. స్థానిక రైతాంగానికి ఆయా పంటలకు సంబంధించిన సూచనలను సలహాలను అందజేశారు.