
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
కలెక్టర్ వల్లూరు క్రాంతి
కంది(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి వెల్లడించారు. కందిలోని మైనారిటీ గురుకుల పాఠశాల అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్‌ను బుధ వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో విద్యను అందిస్తున్నామన్నారు. మైనారిటీ విద్యార్థులు గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదివేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఎల్‌సీ బహుమతి, మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కవిత, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.