
భూములను రీ సర్వే చేయండి
దుబ్బాక: మండంలోని హబ్సిపూర్ గ్రామంలో గల సర్వే నంబర్ 417, 418లో వేణుగోపాలస్వామి ఆలయం పరిధిలో ఉన్న భూములు కొందరు కబ్జా చేశారని గ్రామస్తులు ఎండోమెంట్ అధికారులకు ఫిర్యాదు చేయగా మంగళవారం సర్వే చేశారు. జిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎండోమెంట్ భూములు కబ్జాకు గురైతున్నాయని గ్రామస్తులు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు భూములను సర్వే చేస్తున్నామన్నారు. భూమూలు కబ్జా చేస్తే చర్యలు తప్పవన్నారు. అధికారులు గతంలో సర్వే చేసిన మాదిరిగానే మళ్లీ సర్వే చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో సర్వే చేసి కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు.
మృతురాలు
పుల్‌కల్ మండల వాసి
చేగుంట(తూప్రాన్): ఇటీవల మండల శివారులో కాలిపోయి గుర్తు పట్టకుండా ఉన్న మహిళ మృతదేహం పుల్‌కల్ మండలానికి చెందిన మహిళదిగా పోలీసులు గుర్తించారు. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం మేరకు.. 7న చేగుంట శివారులోని జాతీయ రహదారి పక్కన కాలిపోయి గుర్తు పట్టకుండా ఉన్న మృతదేహం గుర్తించి కేసు నమోదు చేశాం. మృతురాలి ఆచూకీ కోసం విచారణ చేపట్టగా సంగారెడ్డి జిల్లా పుల్‌కల్ పోలీస్ స్టేషన్‌లో బస్వాపూర్ గ్రామంలో మహిళ అదృశ్యంపై కేసు నమోదైనట్లుగా తెలిసింది. ఈ కేసు ఆధారంగా వివరాలు సేకరించి బస్వాపూర్ గ్రామానికి చెందిన జయమ్మగా గుర్తించాం. మహిళది హత్యగా భావించిన పుల్కల్ పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారని ఎస్‌ఐ తెలిపారు.