
గుర్తు తెలియని మహిళ దారుణ హత్య
రామాయంపేట(మెదక్): మండలంలోని తొనిగండ్ల గ్రామ శివారులో సోమవారం రాత్రి గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామ శివారులో మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా తల, ముఖం, చేతులు, ఛాతి కమిలిపోయినట్లు గుర్తించాం. అంగ వైకల్యంతో మృతురాలి రెండు కాళ్ల పాదాలు వంకరగా ఉన్నా యి. కుడి చేతిపై రజిత, ఎడమ చేతిపై మహేశ్ అనే పేర్లు పచ్చబొట్టు వేయించుకుంది. మెదక్‌తోపాటు కామారెడ్డి జిల్లాలో ఆచూకీ కోసం ఆయా పోలీస్‌స్టేషన్లకు సమాచారం పంపించాం. కనీసం ముగ్గు రు వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి ఘటనా స్థలిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. త్వ రలో మృతురాలి ఆచూకీ కనిపెట్టి నిందితులను అ రెస్ట్ చేస్తామని తెలిపారు. అలాగే, తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, స్థానిక సీఐ వెంకట్‌రాజాగౌడ్, ఎస్‌ఐ బాల్‌రాజ్ ఘటన వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి