
రేపు ఖేడ్ గురుకులంలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
నారాయణఖేడ్: ఖేడ్ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో 2025 –26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాల కోసం గురువారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2024 –25 విద్యా సంవత్సరంలో పదవతరగతి ఉత్తీర్ణత సాధించిన బాలురకు ఈనెల 15న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ హయత్‌నగర్‌లోని పీవీటీజీ బాలుర కళాశాలలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
మెరుగైన ఆర్టీసీ సేవలకు కృషి
నారాయణఖేడ్: ఆర్టీసీ సేవలను మరింత మెరుగు పరిచేందుకు కృషి చేస్తామని ఖేడ్ ఆర్టీసీ డీఎం మల్లేశయ్య తెలిపారు. మంగళవారం ఖేడ్ ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖేడ్‌కు చెందిన పండరీరెడ్డి ఫోన్‌చేసి ఖేడ్ నుంచి హన్మంతరావుపేట మీదుగా సంగారెడ్డికి, మాణిక్ పటేల్ ఫోన్‌చేసి ఉదయం ఖేడ్ నుంచి కంగ్టి మీదుగా లింగంపల్లికి బస్సులు నడపాలని కోరారు. నిజాంపేటకు చెందిన లక్ష్మణ్ మండల కేంద్రమైనందున నిజాంపేటలో డీలక్స్ బస్సుస్టాప్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఖేడ్ రాజీవ్ చౌరస్తాలో ప్రయాణికుల నిరీక్షణకు నీడలేనందున సౌకర్యాలున్న మంగల్‌పేట్ బస్టాండ్‌లోనే బస్సులను కొద్దిసేపు నిలపాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను నమోదు చేసుకున్న డీఎం వాటిని పరిష్కరిస్తామని వివరించారు.
దైవచింతనతో
మానసిక ప్రశాంతత
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
పటాన్‌చెరు టౌన్: దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. మంగళవారం అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని అద్దంకి దయాకర్ దంపతులు మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ దంపతులకు వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ ఈవో శశిధర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అవకతవకలు ఉండొద్దు
సంగారెడ్డి: వడ్ల కొనుగోళ్లలో అవకతవకలు ఉండొద్దని డీఆర్డీఓ జ్యోతి సూచించారు. చౌట్కూర్ మండలంలో కొనసాగుతున్న ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించి కొనుగోళ్లపై ఆరా తీశారు. పోసానిపల్లి, వెంకటకృష్ణాపూర్, వెండికోల్ తదితర గ్రామాల్లో తనిఖీ చేసి కొనుగోళ్లకు సంబంధించిన ట్యాబ్ ఎంట్రీలను పరిశీలించారు.
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
నారాయణఖేడ్: కార్మికుల సంక్షేమానికి గొడ్డలిపెట్టుగా మారిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. ఈ నల్లచట్టాల రద్దు కోసం ఈనెల 20న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను ప్రజలంతా జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఖేడ్‌లో సమ్మె పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్‌లపై కార్మిక వర్గం తిరుగుబాటు తప్పదన్నారు. ఈ చట్టాలు అమలైతే ఈఎస్‌ఐ, పీఎఫ్ ఎటు వంటి కార్మిక చట్టాలు అమలు కావని అన్నారు.

రేపు ఖేడ్ గురుకులంలో ప్రవేశాలకు కౌన్సెలింగ్

రేపు ఖేడ్ గురుకులంలో ప్రవేశాలకు కౌన్సెలింగ్

రేపు ఖేడ్ గురుకులంలో ప్రవేశాలకు కౌన్సెలింగ్