
దివ్యాంగుల ఏఐ పరికరాలపై పరిశోధనలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగించి పాక్షిక దివ్యాంగులకు ఉపయోగపడే పరికరాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ ఐఐటీ, ఎంఎన్‌ఆర్ వర్సిటీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు రెండు విద్యా సంస్థలు మంగళవారం ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా ఎంఎన్‌ఆర్ వర్సిటీ చాన్సలర్ ప్రొఫెసర్ రవివర్మ మాట్లాడుతూ...అభివృద్ధి చేసిన పరికరాలను ఆస్పత్రుల్లో పరీక్షించి పాక్షిక దివ్యాంగులకు ఇచ్చేందుకు ఈ పరిశోధనలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ ఫ్రొఫెసర్ రేనూజాన్, బిఏబుల్ హెల్త్ సంస్థ సీఈఓ హబీబ్‌అలీ తదితరులు పాల్గొన్నారు.
ఐఐటీహెచ్, ఎంఎన్‌ఆర్ యూనివర్సిటీ ఒప్పందం