
లంపిస్కిన్ కలకలం
జీర్లపల్లిలో లేగదూడ మృతి
ఝరాసంగం(జహీ రాబాద్): పశువుల్లో ప్రాణాంతక వ్యాధి లంపిస్కిన్ మండలంలో కలకలం రేపింది. జీర్లపల్లిలో శుక్రవారం రాత్రి లేగదూడ మృతి చెందింది. వివరాల ఇలా.. గ్రామానికి చెందిన శ్రీశైలం తన లేగదూడ శరీరంపై దద్దుర్లు, మెడ కింది వాపు, కాళ్ళువాపు లక్షణాలు కనిపించడంతో పశువైద్యుల ను సంప్రదించారు. చికిత్స ప్రారంభించడంతో దూ డ మృతి చెందింది. దీంతో గ్రామంలోని పశుపోష కులు ఆందోళనకు గురవుతున్నారు. మృతి చెందిన పోషకుడి వద్ద ఉన్న మరో దానికి లక్షణాలు ఉ న్నా యని తెలిపారు. దీంతో పశువైద్య శాఖ అధికారులు అప్రమత్తమై గ్రామంలో ప్రత్యేక వైద్య శిబి రం నిర్వహించి తెల్లజాతి పశువులకు టీకాలు వేశారు.