
కుటుంబ సమస్యలతో ఉరేసుకొని ఆత్మహత్య
పాపన్నపేట(మెదక్): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని నార్సింగిలో శనివారం చోటు చేసుకుంది. పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోడ యాదయ్య(48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సమస్యలతో కొంత కాలంగా మద్యానికి బానిస కావడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జీవితం పై విరక్తి చెంది యాదయ్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
జహీరాబాద్‌లో యువకుడు
జహీరాబాద్ టౌన్: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో చోటు చేసుకుంది. శాంతినగర్‌కు చెందిన చాకలి తుకారాం(30) కుటుంబ కలహాల కారణంగా శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ.కాశీనాథ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.